బెట్టింగ్‌కి బానిసై బలవన్మరణం
పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణం చోటు చేసుకుంది. కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపారి కనుపోలు ఉదయ్ కిరణ్(32)…రాత్రికి రాత్రే రాజైపోవాలన్న కలతో ఈజీ మనీ కోసం బెట్టింగ్‌కి అలవాటయ్యాడు.అది కాస్త బానిసగా మార్చేసింది.దాంతో లక్షలకు లక్షల రూపాయల మేర అప్పులు చేశాడు.ఆన్‌లైన్ బెట్టింగ్‌లో దాదాపు రూ.25లక్షల వరకు బెట్ చేశాడు.క్రికెట్,రమ్మీ,కేసినో ఇలా ఒకటేమిటి అన్నీ రకాల జూదాలు ఆడాడు.ఇంకేముంది డబ్బు మొత్తం పోగొట్టుకుని చివరకు ఇంటికి చేరేసరికి అప్పుల వాళ్లు ఇంటి ముందు కూర్చున్నారు.చేసేది లేక ఇంట్లో ప్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.