InternationalNews

ప్రపంచ కుబేరుల్లో అదానీ 2వ స్థానం

స్టాక్ మార్కెట్లో అదానీ కంపెనీలకి చెందిన షేర్ల విలువ బాగా పెరగడంతో ప్రపంచంలో అత్యంత ధనవంతుల లిస్ట్ లో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 2వ స్థానానికి చేరుకున్నారు. ఆయన రెండో స్థానానికి చేరారని ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ సూచీ తెలిపింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా టెస్లా, స్పేస్ ఎక్న్ సంస్థల అధినేత ఎలన్ మస్క్ ఉండగా… ఫ్రాన్స్కు చెందిన బెర్నార్డ్ ఆర్నార్డ్ 3వ స్థానంలో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ 4వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే 2వ స్థానాకి ఎగబాకి రికార్డు నెలకొల్పిన అదానీ ఈ స్థాయికి చేరిన తొలి ఆసియా వ్యక్తి. దీంతోపాటు భారతీయుడు కూడా అదానీయే కావడం విశేషం. ఆయన సంపద 155.7 బిలియన్ డాలర్లకు చేరినట్టు ఫోర్బ్స్ రియల్ టైం సూచీ వెల్లడించింది. మరోవైపు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆసియా ధనికుడిగా ముఖేశ్ అంబానీని అధిగమించారు. అదానీ ఇలాగే దూకుడు కొనసాగిస్తే సునాయాసంగా ఫస్ట్ ప్లేస్ చేరుకోవచ్చునని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి.