ప్రపంచ అపర కుబేరుల్లో మూడోస్ధానంలో అదానీ
ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అరుదైన ఘనత సాధించారు. ప్రంచంలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఆసియా ఖండం నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యాపార వేత్తగా అదానీ కొత్త చరిత్ర లిఖించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని అపర కుబేరుల జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఆసియా సంతతికి చెందిన వ్యక్తి చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో టెస్లా అధినేత ఎలెన్‌మస్క్ మొదటిస్థానంలో ఉన్నారు. ఆయన సంపద విలువ 251బిలియన్ డాలర్లు. ఎలెన్‌మస్క్ తర్వాత అమేజాన్ అధిపతి జెఫ్‌బెజోస్ 153బిలియన్ డాలర్ల సంపదతో రెండోస్థానంలో కొనసాగుతున్నారు. 137 బిలియన్ డాలర్లుసంపద కలిగిన గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల్లో మూడోస్థానాన్ని దక్కించుకున్నారు. ఈ జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 11వ స్థానంలో ఉన్నారు. ఆయన సంసద మొత్తం 91.9 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలి ఆసియా కుబేరుడిగా ముఖేశ్ అంబానీ నిలవగా ప్రస్తుతం అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో శరవేగంగా ఎగబాకుతూ మిగతా సంపన్నులను వెనక్కి నెట్టి మూడోస్థానంలో నిలిచారు. ఆసియాలో ప్రస్తుతం తనను మించిన కుబేరులు లేరు. వ్యాపార విస్తరణలో దూకుడుగా ఉన్న గౌతమ్ అదానీ, ఎలెన్‌మస్క్, జెఫ్‌బెజోస్ లను త్వరలో దాటేసినా ఆశ్చర్యం లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

భారత్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ తర్వాత మూడో అతిపెద్ద వ్యాపార సంస్థగా అదానీ గ్రూప్ కొనసాగుతోంది.నౌకాశ్రయాలు,ఎయిర్‌పోర్ట్‌లు,విద్యుత్ ఉత్పత్తి,గ్రీన్ ఎనర్జీ,గ్యాస్ ఆధారిత రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నఅదానీ గ్రూప్ 5G స్పెక్ట్రమ్ వేలం వేసిన తర్వాత టెలికాం రంగంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది.దాంతో పాటే NDTV లాంటి ప్రముఖ మీడియా సంస్థలనుటేకోవర్ చేసేసన్నాహాల్లోఉందిఅదానీ గ్రూప్.ప్రపంచ కుబేరులకు ర్యాంకింగ్‌లు ఇచ్చే బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ అనేది న్యూయార్క్‌లోని ప్రతి ట్రేడింగ్ డే ముగిసే సమయానికి అప్‌డేట్ చేయబడుతుంది.ప్రపంచ బిలియనీర్ల రోజువారీ ర్యాంకింగ్ఇండెక్స్‌ను బ్లూమ్‌బర్గ్ ప్రకటిస్తుంది.