హైదరాబాద్‌లో నటి హంగామా.. పబ్లిసిటీ కోసమేనా..?
కేబీఆర్ పార్క్‌లో నటి చౌరాసియా హంగామా చేసింది. తాను పార్క్‌లో వాకింగ్‌కి వెళ్లినప్పుడు ఓ యువకుడు తన వెంట పడ్డాడని ఆమె ఆరోపించింది. ఈ మేరకు పార్క్‌లో యువకుడు వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన బంజారాహిల్స్ పోలీసులు పార్క్‌లో సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం పోలీసులు నటి చౌరాసియా వెంట ఎవరూ పడలేదని తేల్చారు. కాగా బంజారాహిల్స్ పోలీసులు నటి చౌరాసియాకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయితే ఆమె కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే ఇదంతా చేస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. గత ఏడాది మాత్రం ఇదే కేబీఆర్ పార్క్‌లో ఆమెపై గుర్తుతెలియని యువకుడు దాడి చేశాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఘటనకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు.

