యాక్టర్ శరత్ బాబు ఇంకా బతికే ఉన్నాడు, చంపేయకండి
తెలుగు, తమిళ భాషల్లో వందల సినిమాల్లో నటించిన నాటితరం నాయకుడు శరత్ బాబు ఆరోగ్యం విషయంలో అలా అని కొందరు, ఇలా అని కొందరు వార్తలు స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదన్నారు ఆయన సోదరుడి కుమారుడు. ప్రస్తుతం శరత్ బాబుకు ఆసుపత్రిలో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారన్నారు. గత రాత్రి ఆయన మృతి చెందినట్లు ప్రచారం జరగ్గా, ఆయన బతికే ఉన్నారని, కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఈరోజు, శరత్ బాబు ఆరోగ్యంపై అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. శరత్ బాబు ఆరోగ్యం బానే ఉందని, సోదరుడి కుమారుడు ఆయుష్ తేజస్ ధృవీకరించాడు.

“శరత్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉంది, బాగానే ఉంది. దయచేసి ఏవైనా నకిలీ పుకార్లను నమ్మొద్దు . వైద్యులు కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. అభిమానులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులు అవసరం.” అంటూ ప్రకటన విడుదల చేశారు. ఆయన కోలుకోవాలని సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు. గత వారం ప్రారంభంలో, శరత్ బాబు హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో చేరారు. 71 ఏళ్ల శరత్ బాబు ఆరోగ్యం విషయమించడంతో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. మల్టీ ఆర్గాన్స్ విఫలం కావడంతో ఆయన చికిత్స అందించడం కష్టంగా మారిందని వైద్యులు చెప్పారు. ఈ ఏడాది మార్చిలో చెన్నైలోని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన తర్వాత ఆసుపత్రిలో చేరడం ఇది రెండోసారి.

