Home Page SliderNational

నటుడు ప్రసన్న గుడ్ బ్యాడ్ అగ్లీలో జాయిన్…

నటుడు ప్రసన్న గుడ్ బ్యాడ్ అగ్లీ తారాగణంతో కలిసి పనిచేయడానికి రెడీ అయ్యారు, అజిత్ పూర్తి వినయం గల వ్యక్తి అని చెప్పారు. ఈ వార్తను ఆయన తన సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో పెట్టారు. గుడ్ బ్యాడ్ అగ్లీకి అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ చేస్తారు. నటుడు అజిత్ కుమార్, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ రాబోయే చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ తారాగణంలో చేరడం పట్ల నటుడు ప్రసన్న తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అక్టోబర్ 3న సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ప్రసన్న కన్‌ఫర్మ్ చేశారు. తాను కొన్ని రోజులు షూట్ చేశానని పేర్కొన్నాడు.