Home Page SliderTelangana

ఈడీ ఎదుట విచారణకు హాజరైన యాక్టర్ నవదీప్

డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ మనీ ట్రాన్సక్షన్స్ కు సంబంధించి ఈడీ విచారిస్తోంది. డ్రగ్స్ అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించి లావాదేవీలపై ఈడీ నవదీప్ ను ప్రశ్నిస్తోంది. అంతకు ముందు డ్రగ్స్ కుంభకోణానికి సంబంధించి ఏజెన్సీ ముందు హాజరుకావాలని టాలీవుడ్ నటుడు నవదీప్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ​​జారీ చేసింది. నైజీరియన్ డ్రగ్ పెడ్లర్‌లతో తనకున్న పరిచయానికి సంబంధించి నటుడిని తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో గతంలో విచారించింది. 2017 డ్రగ్స్ కుంభకోణంలో మనీలాండరింగ్ కోణాన్ని ఎక్సైజ్ శాఖలు దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. నవదీప్‌కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.