Breaking NewsHome Page SliderSpiritualTelangana

యాదాద్రి బోర్డు ఏర్పాటుకు చ‌ర్య‌లు వేగ‌వంతం

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో బోర్డు ఏర్పాటుకు చ‌ర్య‌లు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో ప‌లు మార్పుల‌ను సూచించారు. యాద‌గిరిగుట్ట బోర్డు నియామ‌కపు నిబంధ‌న‌ల‌పై ఈ మేర‌కు సీఎం స‌మీక్ష నిర్వ‌హించారు. తిరుమ‌లలో మాదిరే యాద‌గిరిగుట్ట ఆల‌యం స‌మీపంలో రాజ‌కీయాలకు తావులేకుండా చూడాల‌ని, ఆల‌య ప‌విత్ర‌త కు భంగం క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెప్పారు. ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నియామ‌కంతో పాటు ఆల‌యం త‌ర‌ఫున చేప‌ట్టాల్సిన ప‌లు ఆధ్యాత్మిక‌, సేవా కార్య‌క్ర‌మాల‌పై ముసాయిదాలో పేర్కొన్న నిబంధ‌న‌ల‌కు సీఎం ప‌లు మార్పులు సూచించారు.