ఆ పదిమంది పై చర్యలు తీసుకోవలసిందే
జడ్చర్లలో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్వయంగా “10 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారు” అని చెప్పిన నేపథ్యంలో, వారిపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ డిమాండ్ చేశారు. స్పీకర్ ఎందుకు మొహమాటపడుతున్నారని ప్రశ్నించిన ఆయన, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని స్థితికి చేరుకున్నారని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడి ప్రకటనను సాక్ష్యంగా సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.