Breaking Newshome page sliderHome Page SliderTelangana

హానికారక ORS ద్రావణాలపై చర్యలు – WHO ప్రమాణాలకే అనుమతి

హైదరాబాద్‌: మార్కెట్లో ORS పేరుతో విక్రయమవుతున్న కొన్ని ద్రావణాలు ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, మధుమేహులు మరియు వృద్ధులు ఈ నకిలీ ORS పానీయాలు వాడటం వల్ల తీవ్ర ప్రభావాలు ఎదుర్కొంటున్నారని సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని సంతోష్ తెలిపారు.

ఆమె తెలిపిన వివరాల ప్రకారం, మార్కెట్లో టెట్రా ప్యాకెట్లలో విక్రయమవుతున్న అనేక ఉత్పత్తులు ORS ప్రమాణాలకు అనుగుణంగా లేవు. ఈ విషయంపై ఆమె గత 8 సంవత్సరాలుగా పోరాటం కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, భారత ఆహార భద్రతా మరియు ప్రమాణ సంస్థ (FSSAI) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదం పొందిన ఉత్పత్తులకే ఇకపై “ORS” పేరును ఉపయోగించే అనుమతి ఉందని స్పష్టం చేసింది. ఇతర వాణిజ్య బ్రాండ్లు తమ ప్యాకేజింగ్‌పై ORS లేబుల్ ముద్రించకూడదని ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిర్ణయం వినియోగదారుల ఆరోగ్య భద్రతకు మేలు చేస్తుందని వైద్య నిపుణులు స్వాగతిస్తున్నారు.