యాసిడ్ దాడి నిందితుడు అరెస్ట్
మదనపల్లి వద్ద పీలేరులో యాసిడ్ దాడి నిందితుడు గణేష్‌ను బెంగళూరుకు పారిపోతుండగా పోలీసులు అరెస్టు చేశారు. బ్యూటీపార్లర్‌లో పనిచేసే గౌతమి అనే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తూ ఉండేవాడు గణేష్. ఆమెకు ఏప్రిల్ 29న పెళ్లి జరగనుంది. ఈ విషయం తెలిసిన గణేష్ ప్యారంపల్లిలోని ఆమె ఇంటికి వెళ్లి తననే పెళ్లి చేసుకోవాలంటూ గొడవ చేశాడు. ఆమె అంగీకరించపోవడంతో కోపంతో ఆమెను కత్తితో పలుచోట్ల పొడిచాడు. అంతేకాకుండా వెంట తెచ్చుకున్న యాసిడ్ ఆమె నోటిలో పోశాడు. తీవ్రంగా గాయపడిన గౌతమిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు. యువతులు, బాలికలు వేధింపులకు భయపడవద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు.