లగచర్ల నిందితునికి గుండెపోటు
లగచర్ల ఘటనలో ప్రధాన నిందితునిగా ఉన్న రైతు ఈర్యా నాయక్‌కి గుండె పోటు వచ్చింది.సంగారెడ్డి జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న ఈర్యానాయక్ బుధవారం రాత్రి గుండెపోటుకు గురయ్యాడు.జైలు సిబ్బంది అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఈర్యానాయక్ కి చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. ఈర్యా నాయకత్‌తో పాటు మొత్తం 19 మంది ఒకే గ్రామానికి చెందిన వారు ఇదే సంగారెడ్డి జైల్లో రిమాండ్ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు.