HMDAకు జవసత్వాలు
టిజి: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA)కు జవసత్వాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ప్రణాళిక విభాగంలో పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బందిని నియమించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం HMDA ఏడు జిల్లాల పరిధిలో 7200 చదరపు మీటర్లు విస్తరించి ఉంది. నగరానికి నలువైపులా ఆర్ఆర్ఆర్ పరిధి కలిసేలా HMDAను విస్తరించాలనేది సర్కారు యోచనగా ఉంది.