కొండగట్టు ఘాట్‌రోడ్డులో ప్రమాదం
జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో శుక్రవారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. కొండ నుంచి కిందకు దిగుతుండగా ఆటో ట్రాలీ బోల్తా పడింది.ప్రమాదంలో 12 మంది భక్తులకు గాయాలయ్యాయి. ప్రయాణ సమయంలో ఆటోలో ఉన్న వారంతా మందమర్రి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

