యూపీలో ఘోరప్రమాదం -తల్లితో సహా నలుగురు చిన్నారులు సజీవదహనం
ఉత్తరప్రదేశ్‌లోని కుశి నగర్ అనే జిల్లాలో ఉర్థా ప్రాంతంలో అతి దారుణం జరిగింది. సంగీత అనే 38 ఏళ్ల వివాహిత తన నలుగురు పిల్లలతో ఇంటిలో నిద్రపోతున్న సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీనితో గ్యాస్ సిలెండర్ పేలి పోయింది. క్షణాలలో ఇల్లంతా మంటలు వ్యాప్తి చెందాయి. ఆమె భర్త, అత్తమామలు ఇంటి బయట నిద్రిస్తున్నారు. వీరి కేకలు విన్న వారు వెంటనే వచ్చినా మంటల కారణంగా లోనికి ప్రవేశించలేకపోయారు. ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి, వారిని వెలుపలకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే వారంతా మృత్యువాత పడ్డారు. వీరు సంగీత(38), బాబు (1),గీత (2),రీత(3),లక్ష్మిణ(9),అంకిత్ (10) గా పేర్కొన్నారు. దీనిపై యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఐదుగురుకి కలిపి 24 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు.