Home Page SliderNews AlertTelangana

అంగన్‌వాడీ భవనంలో ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలోని వెంకటాపూర్‌లో అంగన్‌వాడీ కేంద్రంలో ఈ భవనంలో ప్రమాదం జరిగింది. ఈ భవనంలో పైకప్పు పెచ్చులూడిన ఘటనలో ఐదుగురు చిన్నారులు గాయపడ్డారు. అక్కడి సిబ్బంది వారిని హుటాహుటిన వారిని నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ క్రాంతి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆసుపత్రిలో ఉన్న పిల్లలను పరామర్శించారు. వారికి ఎలాంటి ప్రమాదం లేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.