Breaking NewscrimeHome Page SliderNewsTelangana

నిర్మ‌ల్ లో ఏసిబి దాడులు

నిర్మ‌ల్ మున్సిప‌ల్ కార్యాల‌యంపై ఏసిబి బుధ‌వారం దాడులు నిర్వ‌హించింది. లంచ‌గొండి ఉద్యోగిని వ‌ల ప‌న్ని ప‌ట్టుకుంది. కార్యాల‌యంలో జూనియ‌ర్ అసిస్టెంట్ గా బాధ్య‌త‌లునిర్వ‌ర్తిస్తున్న‌ షాకీర్ అనే ఉద్యోగి అదే ప్రాంతానికి చెందిన వ్య‌క్తి నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఏసిబి అధికారులు మాటు వేసి ప‌ట్టుకున్నారు.స‌ద‌రు ఉద్యోగి భాగోతంపై ఏసిబి అధికారులు విచారిస్తున్నారు. సాయంత్రం ఏసిబి కోర్టులో నిందితుణ్ణి హాజ‌రుప‌ర‌చ‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.