మాజీ మంత్రి పీఏ ఇంట్లో ఏసీబీ దాడులు
మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ మురళి నివాసాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలి మండలం దంత గ్రామంతో పాటు బుడితి, లింగనాయుడు పేట, విశాఖపట్నంలోని ఆయన నివాసంలో తనిఖీలు నిర్వహించారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి కృష్ణదాసుకి మురళి పీఏగా విధులు నిర్వర్తించారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. అయితే, ప్రస్తుతం మురళి హెల్త్ డిపార్ట్ మెంట్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. మురళి పనిచేస్తున్న బుడితి సీహెచ్సీలో పలు పత్రాలు పరిశీలించారు.