అర్ధరాత్రైనా వదలని ఏసిబి అధికారులు
వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్డీవో ఆఫీస్‌లో ఏసిబి సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.సోమవారం ఆర్డీవో కార్యాలయ ఏవో దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్యరావు ఇద్దరూ రూ.5లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన సంగతి తెలిసిందే.ఈ మేరకు ఏసిబి అధికారులు నిన్నటి నుంచి ఇప్పటికీ తనిఖీలు చేస్తూనే ఉన్నారు.అర్ధరాత్రి అయినా సరే వదలకుండా తనిఖీలు నిర్వహించారు. దశల వారీగా బృందాలుగా ఏర్పడి దానయ్,మాణిక్యరావుల నివాసాలు,వారి బినామీల ఇళ్లల్లోనూ తనిఖీలు చేపట్టారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఇరిగేషన్ ఏఈఈ అవినీతి భాగోతం వందల కోట్ల కు చేరడంతో అలాంటి తిమింగలాలు ఈ రూపంలో ఏవైనా ఉన్నాయో అనే కోణంలో పట్టుబడిన ప్రతీ అధికారి ఇళ్లల్లో ఇలా నిరవధికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.