Home Page SliderNational

విడాకులపై అభిషేక్, ఐశ్వర్యరాయ్‌ల రియాక్షన్

బాలీవుడ్ స్టార్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల వార్త చాలా రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పైగా ఈ రూమర్స్‌ నిజమన్నట్లుగా అనంత్ అంబానీ పెళ్లిలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడివిడిగా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ వరుస క్రమంలోనే ఏవేవో ఊహించుకుని రీసెంట్‌గా విడాకులు నిజమే అని అభిషేక్ చెబుతున్నట్లు ఓ డీప్ ఫేక్ వీడియో కూడా వైరల్‌గా మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొత్తానికి తమపై వస్తున్న విడాకుల రూమర్స్ గురించి అభిషేక్ బచ్చన్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. నేను దాని గురించి మీతో చెప్పడానికి ఏమీ రాలేదు. మీరందరూ ఇప్పటికే ఈ విషయం నిజమే అన్నట్టు మీడియా ద్వారా బయటపెట్టారు. మీరు ఇదంతా ఎందుకు చేస్తారో నాకు అర్థం కావడం లేదు కానీ, మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలి. ఏం ఫర్వాలేదు.. మేము సెలబ్రిటీలం కాబట్టి, ఇలాంటివి ఈజీగా తీసుకుంటాం. కానీ, క్షమించండి అంటూ తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపించారు అభిషేక్. అంటే అప్పటికి గాని ఐశ్వర్యరాయ్ ఇంకా తనతోనే ఉందన్న సంగతి ప్రేక్షకులకు, ఫేన్స్‌కు తెలియలేదు. ఇది అంతా ఫన్‌లా లేదు.