Home Page SliderNationalPolitics

ఆప్‌లో ఇంటిపోరు..ఆతిశీపై ఆప్ ఎంపీ విమర్శలు

ఢిల్లీ సీఎంగా మంత్రి ఆతిశీ ఎన్నికైన కొద్దిసేపటిలోనే ఆమ్ ఆద్మీ పార్టీలో ఇంటిపోరు మొదలయ్యింది. అదే పార్టీకి చెందిన కొందరికి ఇది అసంతృప్తి కలిగించింది. ఆప్ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ ఈ ఎంపికపై విమర్శలు మొదలుపెట్టారు. ‘ఆతిశీ డమ్మీ సీఎం’ అని పేర్కొన్నారు. ‘ఢిల్లీని ఇక దేవుడే కాపాడాలి’ అంటూ విమర్శించారు. ఆతిశీ కుటుంబంలోని వ్యక్తులు గతంలో ఉగ్రవాది అఫ్జల్ గురును కాపాడేందుకు ప్రయత్నించారని ఆరోపణలు చేశారు. అప్పట్లే ఈ కుటుంబం అఫ్జల్ గురు అమాయకుడని, అతడిని కాపాడాలని, క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్రపతికి కూడా విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. మరోపక్క బీజేపీ కూడా నాయకత్వం మారినంత మాత్రాన ఆమ్ ఆద్మీ ప్రవర్తన మారదు అంటూ విమర్శించింది. ‘ఆతిశీ కూడా వారి అవినీతి కార్యకలాపాలకు బాధ్యత వహించాల్సిందే’… అంటూ బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ విమర్శలు కురిపించారు.