పరీక్ష కోసం ఓ యువతి సాహసం
విజయనగరం జిల్లా గణపతి మండలంలోని మర్రివలస గ్రామానికి చెందిన కళావతి అనే యువతి పెద్ద సాహసం చేసింది. తమ గ్రామానికి చెందిన చంపావతి నది ఉద్ధృతంగా ప్రవహించడంతో గ్రామం దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కానీ తాను విశాఖలో ఓ ముఖ్యమైనా పరీక్ష రాయడం తప్పని సరిగా మారింది. ఈ క్రమంలోనే ఆ యువతి తన అన్నదమ్ములతో కలిసి నది దాటే ప్రయత్నం చేసింది. అంతా తీవ్రంగా ప్రవహిస్తున్న నదిలో తన సోదరిని తమ భుజాలపై మోస్తూ నది దాటించారు. తర్వాత అక్కడి నుండి ఆమె వాహనంలో విశాఖకు వెళ్లింది. దీనిని గమనించిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.