పెళ్లికి సాయం చేస్తానంటూ… యువతిపై అత్యాచారం
హైద్రాబాద్‌లోని జూబిలీ హిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది.పెళ్లికి ఎంగేజ్ అయిన ఓయువతిని ఆటోలో కొన్నాళ్లుగా అనుసరిస్తూ పరిచయం పెంచుకున్న వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.పెళ్లి వస్తువులు తీసుకుని ఆటోలో ఇంటికి చేరుకున్న యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఆటోలో పెళ్లి కూతురి పెళ్లి సామాన్లు…ఇంటి వద్దకు తానే తీసుకువస్తానని చెప్పడంతో గుడ్డిగా నమ్మిన యువతి…ఆ సామాన్లతో ఇంటి లోపలి వరకు డ్రైవర్‌కు అనుమతిచ్చింది.దీంతో ఎవరూ లేరని గ్రహించి ఆ యువతిపై బలవంతంగా అత్యాచారం చేశాడు.దిండు మొహంపై పెట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడని,డ్రైవర్ నరసింహా అని ఆ బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.