Home Page SliderTelangana

నిర్లక్ష్యంగా కారు నడిపిన సాఫ్ట్‌వేర్ యువతి -నిండు ప్రాణాలు బలి

ఒకరి నిర్లక్ష్యం మరొకరి పాలిట మృత్యువయ్యింది. ఒక కుటుంబం మొత్తానికే శాపమయ్యింది. హైదరాబాదులోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శివానీ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అతివేగంగా  కారు నడిపి స్విగ్గీ బాయ్ రాజు  ప్రాణం బలిగొంది. ఈ ప్రమాదంలో ఇతనితో పాటు మరో ముగ్గురు వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. రాజుకు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. రాజు ఒకడే వారి కుటుంబానికి ఆధారం. రాజు మృత్యువాత పడడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. వారికి జీవనోపాధికి దిక్కులేదని వాపోతున్నారు కుటుంబీకులు.  వారిని ఆదుకోవాలని, న్యాయం చేయాలని కోరుతున్నారు రాజు స్నేహితులు, బంధువులు. తాను సృహ తప్పడం వల్లే ఆక్సిడెంట్ జరిగిందని శివానీ చెపుతోంది.