హామీలు ఎగ్గొట్టడంలో, అప్పులు తేవడంలో వరల్డ్ రికార్డు
కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలులో విఫలమైందంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన విమర్శలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ వేదికగా తిప్పికొట్టారు. ఢిల్లీ చెప్పులు మోసే గుజరాత్ గులాములు.. హామీలు ఎగ్గొట్టడంలో, అప్పులు తేవడంలో వాళ్లే ప్రపంచ రికార్డు సాధించారని బీజేపీ పాలనపై మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. బీజేపీ ఎగ్గొట్టిన హామీలను చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారని విమర్శించారు. మీరు తెచ్చిన రూ. 150 లక్షల కోట్ల అప్పులు దేశానికి గుది బండగా మారాయన్నారు. కోతలు, వాతలతో సామాన్యుల నడ్డి విరచడంలో వారు నిష్ణాతులని పేర్కొన్నారు. చేతనైతే తెలంగాణ హక్కులను కాపాడాలని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రప్పించాలని, అంతేకానీ అవాకులు చవాకులు పేలితే తెలంగాణ సమాజం క్షమించదని పొన్నం హెచ్చరించారు.