Andhra PradeshHome Page Slider

ఏపీలో జగన్‌కు చిరంజీవి ఝలక్, ఎన్డీయేకు మద్దతు ప్రకటించిన మెగాస్టార్

Share with

మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత, తమ్ముడు పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎన్డీయే కూటమికి ఓటేయాల్సిందిగా వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేశారు. APలో ఎన్నికల భవితవ్యాన్ని నిర్ణయించే ప్రధాన కులాలలో ఒకటైన రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నటుడుగా చిరంజీవి గుర్తింపు పొందారు. నటుడు-రాజకీయ నాయకుడు, కాపు ప్రముఖుడు చిరంజీవి కొణిదెల, ఏప్రిల్ 21, ఆదివారం, రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు NDA కి జై కొట్టారు. ఎన్డీయే అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబులకు మద్దతు ఇవ్వాలని ఆయన వీడియో ప్రకటనలో ప్రజలను కోరారు. “సంవత్సరాల రాజకీయ నిరాసక్తత తర్వాత, నేను జనసేన, టీడీపీ, బీజేపీల మధ్య పొత్తుకు సంబంధించి రాజకీయాల గురించి మళ్లీ మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, NDA అభ్యర్థులకు, ముఖ్యంగా నా సన్నిహితులైన సిఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబులకు ఓటు వేయండి.” అని పిలుపునిచ్చారు.

అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్‌, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిగా రమేష్‌బాబు బరిలోకి దిగారు. మే 13న ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, అధికార వైఎస్సార్‌సీపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. సీపీఐ, సీపీఐ(ఎం)తో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పోటీ చేస్తోంది. ఆంధ్రాలో కాపు ఓట్లు కీలకంగా ఉన్నాయి. చిరంజీవి రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. ఇది రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను నిర్ణయించే ప్రధాన కులాలలో ఒకటి. తమ సామాజికవర్గానికి చెందిన ముఖ్యమంత్రి పీఠం కోసం కాపులు చాలా కాలంగా ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా అదే ఆశించారు. అయితే 2011లో ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆయన సోదరుడు పవన్‌కల్యాణ్‌కి చెందిన జనసేన, బీజేపీ, టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ మంచి ప్రాతినిథ్యం వస్తుందని కాపు వర్గాలు భావిస్తున్నాయి.