Home Page SliderInternationalNews Alert

ఆకాశంలో అద్భుత దృశ్యం.. అంతుచిక్కని వెలుగు రేఖ

గత కొద్ది రోజుల నుండి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వడగళ్ల వానలు ప్రజలను ఒక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు ఆకాశంలో వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అమెరికా కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో అద్భుతం జరిగింది. ఆకాశంలో అంతుచిక్కని వెలుగు రేఖ స్థానికంగా కలకలం రేపింది. నీలాకాశంలో అంతు చిక్కని వెలుగులతో ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వెలుగు రేఖ 40 సెకండ్లపాటు కనిపించి అదృశ్యమైంది. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా నీలాకాశంలో కనిపించిన ఆ వెలుగును సెల్‌ఫోన్‌ ద్వారా వీడియోలు తీశారు. ఆకాశంలో మండుతున్నట్టుగా కనిపించిన వెలుగు రేఖ కేవలం కొన్ని సెకండ్లపాటు కనిపించి మాయమైపోవడంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం  ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.