పిల్లి కోసం పక్కింటి వారిపై కేసు పెట్టిన మహిళ..
తెలంగాణ నల్గొండ జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ కు చెందిన పుష్పలత అనే మహిళ మూడు సంవత్సరాలుగా పెంచుకుంటున్న తెల్లటి పిల్లి సంవత్సరం క్రితం తప్పిపోయింది. అయితే.. అలాంటి పోలికలతో ఉన్న తెల్లటి పిల్లి, అచ్చం అవే లక్షణాలతో ఆమె తన పక్కింట్లో కనబడటంతో ఆ పిల్లి తనదేనని దానిని దొంగలించి బ్రౌన్ రంగు వేసి తమ వద్ద ఉంచుకున్నారని, పిల్లిని తనకు అప్పగించాలని నల్గొండ టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే..ఆ పిల్లి నాది అంటే కాదు కాదు ఆ పిల్లి నాది అంటూ గొడవకు దిగారు. ఇక పెంచిన వారే గుర్తు పట్టలేకపోతే.. పోలీసులు ఎలా గుర్తు పట్టగలరు. దీంతో వారు కూడా చేతులేత్తేశారు. ఆ పిల్లి వ్యవహారం కాస్తా ఫోరెన్సిక్ ల్యాబ్ కు చేరింది. ఇప్పుడు ఆ రిపోర్టు కోసం వేచి చూస్తున్నారు. దాని వివరాలు రాగానే.. ఆ పిల్లి ఎవరిది అనేది పోలీసులు తేల్చనున్నారు.

