భర్తకు ఉరేసి, చంపిన భార్య
మహిళలు సహనానికి మారుపేరు. కానీ ఆ సహనానికి కూడా హద్దు ఉంటుంది. కొంతమంది భర్తలు మద్యం మత్తులో హద్దులు మీరి చేసే అకృత్యాలు తట్టుకోలేని భార్యలు వారిని చంపి క్రిమినల్స్‌గా మారుతున్నారు. ఇటీవల కర్ణాటకలో సొంత కుమార్తెపై అఘాయిత్యం చేసిన రాక్షసుడిని చంపి కత్తితో ముక్కముక్కలుగా నరికేసింది సావిత్రి అనే మహిళ. అలాంటి ఘటనే ఇప్పుడు ఏపీలోని బాపట్ల జిల్లా పెద్దూరులో జరిగింది. రోజూ భర్త అమరేంద్ర బాబు తాగి వచ్చి పెట్టే బాధలు భరించలేక పోలీసులకు కంప్లైంట్ చేసింది అరుణ అనే మహిళ. వారు అతనిని మందలించి పంపడంతో కోపం పట్టలేక అతడు మళ్లీ తాగి వచ్చి కత్తితో భార్యతో గొడవపడ్డాడు. తనను చంపేస్తాడేమోనని భయపడిన ఆమె కర్రతో తలపై బలంగా కొట్టి, రోడ్డుపై లాగి మెడకు ఉరి బిగించి హత్య చేసింది. ఒక వ్యక్తి వీడియో తీయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనితో ఆమె పరారీ అయ్యింది.

