ఛాంపియన్లకు ఘన స్వాగతం..స్టెప్పులేసిన క్రికెటర్లు
టీమిండియా T20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత హరికేన్ కారణంగా బార్బడోస్‌లోనే నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కోసం BCCI ప్రత్యేక విమానాన్ని పంపించి వారిని స్వదేశానికి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేసింది. ఈ మేరకు టీమిండియా ఈ రోజు ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. కాగా ఢిల్లీ చేరుకున్న టీమిండియాకి BCCIతోపాటు,క్రికెట్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి క్రికెటర్లు మౌర్య హోటల్‌కు చేరుకున్నారు. కాగా అక్కడ అభిమానులు క్రికెటర్లకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్లు డప్పు చప్పుళ్లకు చిందులేశారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ,హార్ధిక్ పాండ్యా,సూర్య కుమార్ యాదవ్,యశస్వీ జైస్వాల్,రిషబ్ పంత్ ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.