Home Page SliderNational

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు

ఢిల్లీ లిక్కర్ స్కాం కొత్త మలుపులు తిరుగుతోంది. సీబీఐ ఈ కేసులో దూకుడు పెంచింది.  ఈ కేసులో కీలక సూత్రధారి ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై కీలక సాక్ష్యాలు లభ్యమయ్యాయని సీబీఐ తెలియజేసింది. ఛార్జిషీట్ పూర్తయ్యిందని, దానిలో వివరాలు పొందుపరచామని పేర్కొంది. మనీష్ సిసోడియా పాత్రపై చాలా సాక్ష్యాలు దొరికాయని, ప్రతీ సంవత్సరం 500 కోట్ల రూపాయల అవినీతికి మనీష్ ప్లాన్ చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించారు. వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె,ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు.