Home Page SliderNational

రతన్ టాటాకు వజ్రాలతో నివాళి

భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు దేశవ్యాప్తంగా పలువురు అభిమానులున్నారు. ఆయన గొప్ప వ్యాపారవేత్తే కాదు, మానవతామూర్తి కూడా.  గుజరాత్‌లోని సూరత్‌కు  చెందిన  వజ్రాల వ్యాపారి విపుల్ భాయ్ తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. దాదాపు 11 వేల అమెరికన్ వజ్రాలతో రతన్ టాటా చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రాన్ని వీడియోలో తీసు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టంగా నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.