Breaking NewscrimeHome Page SliderNational

మ‌హారాష్ట్రలో ఘోర రైలు ప్ర‌మాదం

మహారాష్ట్రలోని ప‌రండా రైల్వే స్టేష‌న్ స‌మీపంలో ఘోర రైలు ప్ర‌మాదం జ‌రిగింది. బుధ‌వారం సాయంత్రం పుష్ప‌క్ ఎక్స్ ప్రెస్ రైలులో మంట‌లు వ్యాపించాయి.గుర్తు తెలియ‌ని ప్రయాణీకుడు పుష్ప‌క్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ చైన్ లాగ‌డంతో బోగీలో మంట‌లు వ్యాపించాయి.దీంతో ఒక బోగీలో ప్ర‌యాణిస్తున్న 20 మంది స‌జీవ ద‌హ‌నమ‌య్యారు.దీంతో కొంత మంది ప్ర‌యాణీకులు ఆగ‌బోతున్న రైలు నుంచి దూకారు.ప‌ట్టాలు దాటుతుండ‌గా అటు నుంచి వ‌స్తున్న బెంగళూరు ఎక్స్ ప్రెస్ ఢీకొట్ట‌డంతో 6గురు ప్ర‌యాణీకులు చ‌నిపోయారు. జ‌ల్ గావ్ ద‌గ్గ‌ర ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.భోగీ అంత‌టా మంట‌లు వ్యాపించ‌డంతో ప్ర‌యాణీకులు క‌నీసం ప్రాణాల‌ను ద‌క్కించుకోలేక మంట‌ల్లోనే కాలి బూడిద‌య్యారు.రైల్వే శాఖ అప్ర‌మ‌త్త‌మై స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేసింది.మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.ప‌లు రైళ్ళ‌ను దారిమ‌ళ్లించ‌గా మ‌రికిన్ని రైళ్ల‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. మ‌రికొన్ని