crimeHome Page SliderNational

ఘోర అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. తూర్పు ఢిల్లీలోని ఆనంద్ విహార్ వద్ద ఉన్న ఏజీసీఆర్ ఎన్‌క్లేవ్ సమీపంలోని ఓ గుడిసెలో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. మృతులు యూపీ వాసులుగా గుర్తించారు.