హిమాలయ సానువుల్లో ఘోర ప్రమాదం
హిమాలయ సానువుల్లో ఓ పర్వతం బరస్ట్ అయ్యింది.చమోలి -బద్రినాథ్ హైవేపై గ్లేసియర్ (హిమానీనదం) బద్దలయ్యింది. దీంతో అదేప్రాంతంలో రోడ్డు పనులు చేస్తున్న 57 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు మంచులో కూరుకుపోయారు. వారిలో 10 మందిని రక్షించగా, 47 మంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. సహాయక చర్యల కోసం ఎస్.డి.ఆర్.ఎఫ్, ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. తీవ్ర గాలింపు చర్యలు చేపట్టాయి.అయినా గల్లంతైన వారి ఆచూకీ తెలియలేదు.దీని గురించి బంధువులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని రోజులుగా అక్కడ భారీగా మంచు కురుస్తోండటంతో కార్మికులు రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా…అదే రోడ్డు లో బలవ్వడం తీవ్ర కలకలం రేపింది.

