InternationalNews Alert

ఘోర ప్రమాదం… డ్యామ్ కూలి 60 మంది మృతి…!

ఆఫ్రికా దేశం, సూడాన్ లో భారీ వర్షాలకు తూర్పు ప్రాంతంలోని అర్బాత్ డ్యామ్ కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో కనీసం 60 మంది మరణించి ఉంటారని, అంతే కాదు అక్కడి ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయని, సహాయక చర్యలు చేపడుతున్నాం అని అక్కడి అధికారులు తెలిపారు. సూడాన్‌లోని రెడ్‌సీ స్టేట్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడ అర్బాత్ డ్యామ్ కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 100 మంది గల్లంతయినట్లు పేర్కొంటున్నారు. నష్టం తీవ్రస్థాయిలోనే ఉండవచ్చని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు.