Home Page SliderInternationalNews Alert

ఆ దేశాల మధ్య జోరుగా ట్రేడ్ వార్…

ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా పేరు పొందిన అమెరికా, చైనాల మధ్య భయంకరమైన ట్రేడ్ వార్ మొదలయినట్లే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్  ఇప్పటికే చైనా నుండి వచ్చే వాణిజ్య వస్తువులపై 10 శాతం టారిఫ్స్ వేసిన సంగతి తెలిసిందే. ఈ టారిఫ్స్ శనివారం నుండి అమలులోకి రానున్నాయి. డ్రాగన్ చైనా కూడా తక్కువేమీ తినలేదు. అమెరికా నుండి దిగుమతి చేసుకునే బొగ్గు, క్రూడాయిల్, వ్యవసాయ యంత్రాలు, కార్లు, ట్రక్‌లపై 10 శాతం సుంకాలు విధించింది. అమెరికాకు చైనా, భారత్, మెక్సికో, కెనడా నుండి వచ్చే వస్తువులపై సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. అమెరికా ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, ఇతర దేశాలు కూడా అలాగే సుంకాలు విధిస్తున్నాయని ఇటీవల వ్యాఖ్యానించారు. అలాగే ఉక్రెయిన్‌కు అందించే సైనిక సహాయంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మీకు సహాయం చేస్తే మాకేం వస్తుంది అన్నట్లు మాట్లాడారు. ఆ సహాయానికి బదులుగా ఉక్రెయిన్ వద్ద ఉన్న అరుదైన ఖనిజ భాండాగారంపై మాకు కూడా హక్కులు ఇవ్వాల్సి ఉంటుంది అంటూ పక్కా బిజినెస్‌డీల్ మాట్లాడుతున్నారు.