Home Page SliderNationalviral

తాళిబొట్లు తెంచి, వితంతువులుగా వింత పండుగ

తమిళనాడులోని కూవాగంలో కూత్తాండవర్ రథోత్సవం పండుగలో ఒక వింత ఆచారం పర్యాటకులను ఆశ్చర్యపరుస్తోంది. కళ్లకురిచ్చి జిల్లాలోని కూవాగం గ్రామంలో చిత్తిరై ఉత్సవాలలో భాగంగా గత మూడు రోజులుగా హిజ్రాలు సందడి చేశారు. ఆలయ పూజారి చేతుల మీదుగా వీరందరూ తాళి కట్టించుకున్నారు. పగలు, రాత్రి ఆటపాటలతో సందడి చేశారు. ఈ వేడుక కోసం కూవాగం, కిలక్కు కుప్పం, శిరాలాయం కుళం, పందలాడి వంటి గ్రామాల నుండి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. రథంపై కూత్తాండవరం చేతులు, కాళ్లు, శిరస్సు ఆకారాలను తీసుకొచ్చి ఉంచారు. ఉత్సవం అనంతరం బలిదానం జరిగింది. ఈ బలిదానంలో తమ దేవుడు బలి కావడంతో హిజ్రాలంతా తాళిబొట్లు తెంచిపడేసి, విషాదంతో కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం అక్కడ కొలనులో స్నానం చేసి తెల్లచీరలు ధరించి తమ గ్రామాలకు ప్రయాణమయ్యారు.