Home Page SliderNational

హోటల్‌లో సర్వర్ అవతారమెత్తిన స్టార్ హీరో

తెలుగులో బిచ్చగాడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకొని బాగా పాపులర్ అయ్యారు తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోని. ఈ సినిమాలో ఆయన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. కాగా ఆయన ఇటీవల కాలంలో మరోసారి బిచ్చగాడు -2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ ఆంటోని నటించిన ఈ సినిమా ఈ నెల 19న తెలుగులో విడుదల అయ్యింది.  అయితే విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే 9.5 కోట్ల కలెక్షన్లు రాబట్టి బ్సాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు చెప్పేందుకు విజయ్ ఓ హోటల్‌లో వెయిటర్‌ అవతారమెత్తారు. విజయ్ ఆంటోని స్వయంగా ఫుడ్ అందిస్తూ.. ప్రజలకు సర్‌ప్రైజ్ ఇచ్చిన వీడియో నెట్టింట్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన విజయ్ ఫ్యాన్స్‌ అంతా వాట్ ఎ సింప్లిసిటీ విజయ్ అని ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.