‘ఓజి’పై సాలిడ్ అప్‌డేట్
ప్రముఖ నిర్మాత డివివి దానయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే వార్త అందించారు. న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ ‘సరిపోదా శనివారం’ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను పూర్తిగా అలరిస్తుందని.. ఈ సినిమాతో నాని బాక్సాఫీస్ వద్ద మరో సెన్సేషనల్ హిట్ కొడుతున్నాడని దానయ్య చెప్పారు. ఈ సందర్భంగా నాని పవన్ కళ్యాణ్ ‘ఓజి’ గురించి అప్‌డేట్ ఇవ్వండి అని కోరారు. దీంతో ‘ఓజి’ చిత్ర షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం అవుతుందని.. రిలీజ్ కూడా దగ్గరలోనే ఉంటుందని దానయ్య తెలిపారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. ఇక ‘సరిపోదా శనివారం’ మూవీలో అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తుండగా, జాక్స్ బిజాయ్ సంగీతం సమకూరుస్తున్నాడు.