తెలంగాణ అప్పుల తిప్పలపై లఘు చర్చ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆ రాష్ట్ర అప్పల తిప్పలను డీసీఎం భట్టి తెరమీదకు తెచ్చారు. పదేళ్ల పాటు బీఆర్ ఎస్ పార్టీ అప్పులతో పాలన నెట్టుకొచ్చిందని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశామని గుర్తు చేశారు. మొత్తం అప్పు రూ.6లక్షల 71 వేల కోట్లు ఉందని భట్టి వెల్లడించారు. అప్పులపై హరీష్‌రావు అనేక ఆరోపణలు చేశారని, ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్లు చెప్పడం హరీష్‌రావుకు వెన్నతో పెట్టిన విద్యంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నేతల పెండింగ్ బిల్లులే రూ.40వేల 150 కోట్లు పెట్టారని, ఆ అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపితే మొత్తం రూ.7లక్షల 19వేల కోట్లు అయ్యిందని, తాము అధికారంలోకి వచ్చాక రూ.52వేల 118 కోట్లు అప్పు చేశామని దాదాపు లక్ష కోట్ల మేర వడ్డీలు చెల్లించామని చెప్పారు. దీనిపై హరీష్ రావు మాట్లాడుతూ సభను తప్పు దోవ పట్టించడానికి అప్పుల ప్రస్తావన తెస్తున్నారని మండిపడ్డారు.