Home Page SliderNationalNews Alert

రైల్వే ప్రయాణికులకు షాక్

ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్‌లో ప్రయాణికులకు షాక్ తగిలే అవకాశం ఉంది. కాస్త భారీగానే రైల్వే టిక్కెట్ల ధరలు పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇటీవల పలు రైల్వే స్టేషన్లను ఆధునికీకరించడం, వందేభారత్ వంటి హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టడం వంటి అంశాలు దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖకు అధిక బడ్జెట్ కేటాయించడం వల్ల భారీగా ఖర్చు చేశారని అధికారులు పేర్కొన్నారు. కొత్త ట్రాక్‌ల నిర్మాణం, అప్ గ్రేడింగ్, హైస్పీడ్ రైళ్ల కారిడార్, బుల్లెట్ ట్రైన్ల ప్రాజెక్టుల కోసం ప్రత్యేక కేటాయింపులు అవసరమని భావిస్తున్నారు. భద్రత, రైళ్ల సామర్థ్యం పెంపుపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని బడ్జెట్‌లో రైల్వే ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది.