పసిడి ప్రియులకు షాక్
పసిడి ధరలు వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. కొద్దిగా తగ్గినట్లే తగ్గి ఊరించి, అంతలోనే అమాంతం ధరలు పెరిగిపోతున్నాయి. నేడు హైదరాబాద్‌లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.550 పెరిగి, రూ. 80,620కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.500 పెరిగి, రూ.73,900 పెరిగింది. కేజీ వెండి ధర రూ.100 పెరిగి లక్ష రూపాయల మార్కును దాటి, రూ.1,01,100కి చేరింది.