ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊరట
తెలంగాణను కుదిపేసి ,బీ.ఆర్.ఎస్. ను రాజకీయంగా ఇరుకున పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ కేసులో అరెస్టై జైల్లో ఉన్న హైద్రాబాద్ సెక్యురీటి వింగ్ అదనపు డిసిపి తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది .ఈ మేరకు ట్రయల్ కోర్టుకు ..సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. 10 నెలలుగా జైల్లో ఉన్న తిరుపతన్న మంగళవారం ఎట్టకేలకు విడుదల కానున్నారు. మరో వైపు అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్ ని ఇండియా రప్పించేందుకు ఇంటర్ పోల్ అధికారులు శతథా ప్రయత్నిస్తున్నారు.

