BusinessHome Page Slidertelangana,

కలర్స్ సంస్థకు ఎదురుదెబ్బ

బరువు, కొవ్వు తగ్గిస్తామంటూ అబద్దపు ప్రచారం చేస్తూ, వినియాగదారులను మోసం చేసినందుకు కలర్స్ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సంగారెడ్డి జిల్లా వినియోగదారుల కోర్టులో ఒక యువతి కలర్స్ సంస్థ మోసం చేసిందని ఫిర్యాదు చేసింది.  విచారణ చేపట్టిన కోర్టు ఆమె చెల్లించిన రూ.1,05,000 తొమ్మిది శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది.  ఈ జరిమానాపై కలర్స్ హెల్త్ కేర్ అప్పీల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన రాష్ట్ర వినియాగదారుల కమిషన్ ఈ అప్పీల్‌ను కొట్టేసింది.