ఊపిరితిత్తుల వద్ద పళ్ల సెట్..అరుదైన ఆపరేషన్
విశాఖ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో అరుదైన సర్జరీ నిర్వహించారు. విశాఖకు చెందిన ప్రకాశ్ (52) పళ్ల సెట్టు నిద్రలో ఊడిపోవడంతో ప్రమాదవశాత్తూ మింగేశాడు. దీనితో అతడికి అధికంగా దగ్గు ప్రారంభమయ్యింది. దీనితో కిమ్స్ ఐకాన్‌లోని పల్మనాలజిస్టును సంప్రదించారు. వారు స్కానింగ్ చేసి, ఊపిరితిత్తుల వద్ద పళ్లసెట్టు ఉన్నట్లు గుర్తించారు. ఈ పళ్లకు రెండు వైపులా లోహం ఉందని, జాగ్రత్తగా తీయకపోతే ఊపిరితిత్తులకు, శ్వాస నాళాలకు ప్రమాదం కలగవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి సమస్య రాకుండా రిజిడ్ బ్రాంకోస్కోపి అనే పరికరం సహాయంతో ఆ పళ్లసెట్టును తీశారు. ఈ పద్దతిలో నోటి ద్వారా పైపును పంపించి, జాగ్రత్తగా ఆపరేషన్ చేస్తారు. ప్రస్తుతం ప్రకాశ్ కోలుకుంటున్నారని వైద్యులు భరత్ తెలిపారు.