చెట్టును ఢీకొట్టిన స్కూల్ బస్
విద్యార్ధులు ప్రయాణీస్తున్న స్కూల్ బస్సు అదుపు తప్పింది.. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రమాదానికి గురయ్యింది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పదుల కొద్దీ విద్యార్ధులు ప్రయాణీస్తున్న బస్సుకి పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.డివైన్ గ్రేస్ ఇంటర్నేషనల్ స్కూల్ కి చెందిన బస్సు… 40 మంది విద్యార్ధులతో స్కూల్ కి బయలుదేరింది. కీసర సమీపంలోకి రాగానే అదుపు తప్పింది. రోడ్డు పక్కను ఉన్న పెద్ద చెట్టుని ఢీకొని ఆగిపోయింది.ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పాక్షికంగా ధ్వంసం అయ్యింది. పలువురు విద్యార్ధులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రధమ చికిత్స చేసి ఇళ్లకు పంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.