లారీని ఢీకొన్న స్కూల్ బస్
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్…అదుపు తప్పి రోడ్డు మీద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.పలువురు విద్యార్ధుల పరిస్థితి విసమంగా ఉంది. డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి బస్సులో పలువరు విద్యార్దులను సురక్షితంగా బయటపడేశారు.ఘటనా స్థలానికి ఎస్పీ దామోదర్ చేరుకుని పరిశీలించారు.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.కృష్ణా జిల్లాకు చెందిన విద్యార్ధులుగా గుర్తించారు.వీరంతా విహార యాత్రకు వెళ్లివస్తుండగా …నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు వద్ద ఈ దుర్ఘటన జరిగింది.

