ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోనే రికార్డు అప్పీల్
నాయకుడికి నటించేవాడికి చాలా తేడా ఉంటుంది. ఎదుటి మనిషికి బాధ వచ్చినప్పుడు కన్నీళ్లు తుడిచే వాడికి…కన్నీళ్లు పెట్టుకుని తన ఇంటి సమస్యలా భావించే వాడికి వ్యత్యాసం ఉంది.వైట్ కాలర్ నాయకులంతా తమ తమ స్వార్ద ప్రయోజనాల కోసం ఏదో కంటితుడుపు ప్రకటనలు చేసి మమ అనిపించుకుంటారు.కానీ కేటిఆర్ మాత్రం అలా కాదు.ఇండియన్ పొలిటిక్ హిస్టరీలోనే రైతుల తరుఫున ఏకంగా న్యాయమూర్తిని సైతంగా బహిరంగంగా (కోర్టు ద్వారా కాదు) రైతులను విడిచిపెట్టండి సార్ అని అర్జ్ చేసిన ఏకైక నాయకుడిగా నిలిచిపోయాడు.దటీజ్ ఈజ్ ది లీడర్ అని బీఆర్ ఎస్ శ్రేణులు ఎంతో భావోద్వేగానికి గురౌతున్నాయి.లగచర్ల ఘటనలో రిమాండ్ ఖైదీగా ఉన్న ఈరన్నకు రాత్రి గుండె పోటు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఆ సమయంలోనూ ఖైదీకి సంకెళ్లు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లడం పట్ల కేటిఆర్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు.ఈ నేపథ్యంలో భావోద్వేగంతో ప్రకటన చేశారు.” అరెస్ట్ అయిన వ్యక్తికి గుండెపోటు వస్తే కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పరా? ఇంకా ఘోరం ఏంది అంటే.. గుండెపోటు వచ్చిన హీర్యా నాయక్ అనే సోదరుడిని ఆసుపత్రికి బేడీలతో తీసుకువచ్చారు. నేను గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, రాష్ట్ర గవర్నర్ ని, రాహుల్ గాంధీని ఒకటే కోరుతున్నా అరెస్ట్ అయిన రైతులను వెంటనే విడుదల చేయండి.రాహుల్ గాంధీకి మానవత్వం అనేది ఉంటే రేవంత్ రెడ్డిని మందలించండి.. ఆయన ఏమో జైపూర్లో విందులు వినోదాలతో హ్యాపీగా ఉన్నాడు.ఇక్కడ ఏమో కేవలం తమ భూమిని ప్రభుత్వం డిమాండ్ చేసిన విధంగా ఇవ్వము అని చెప్పిన పాపానికి గిరిజన రైతులు జైలులో చనిపోయే పరిస్థితిలో ఉన్నారు ” అని ఘాటుగా స్పందించారు.