Home Page SliderInternational

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఈ సినిమా  ఆస్కార్ బరిలో నిలిచి ఆస్కార్ అవార్డును సైతం కైవసం చేసుకుని తెలుగు వాడి సత్తా ఏంటో ప్రపంచానికి చాటీ చెప్పింది. అయితే ఈ సినిమాలో నటించిన జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రపంచ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. అదేంటంటే ఆస్కార్ అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్‌లో ఎన్టీఆర్‌కు చోటు దక్కింది. కాగా మొత్తం 5గురు యాక్టర్లను తమ బ్రాంచ్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు ఆస్కార్ అకాడమీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు కే హుయ్ క్వాన్,మార్షా స్టేఫానీ బ్లేక్,కేర్రీ కాండన్,రోసా సలాజర్ ఉన్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “దేవర” సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు.కాగా ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.